హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ కు రోశయ్య కౌంటర్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను విమర్శలను తిప్పికొట్టేందుకు ముఖ్యమంత్రి కె. రోశయ్య పకడ్బందీ వ్యూహారన్ని రచించి అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాల అమలుపై ముఖ్యమంత్రి కె. రోశయ్యపై వైయస్ జగన్ ప్రత్యక్షంగా విమర్శలకు దిగారు. పావలా వడ్డీ రుణాల పథకం అమలు తీరును ఆయన ప్రశ్నించారు. మహిళలకు పావలా వడ్డీ రుణాలు అందకపోవడం వల్ల తాను తల దించుకుంటున్నానని ఆయన అన్నారు. అంతేకాకుండా సాక్షి దిన పత్రిక ద్వారా ఆయన సంక్షేమ పథకాలకు రోశయ్య సంక్షేమ పథకాలకు కోత పెడుతున్న తీరును ప్రశ్నిస్తున్నారు. ఒక రకంగా రోశయ్య ప్రభుత్వంపై పత్రిక ద్వారా ప్రత్యక్ష యుద్ధానికి దిగినట్లే కనిపిస్తున్నారు. ఈ స్థితిలో రోశయ్య తన అస్త్రాలను బయటకు తీశారు.

వైయస్ పథకాలనే ప్రశ్నించే పరిస్థితిని రోశయ్య కల్పించారు. కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెసు నాయకులు వైయస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై విమర్శలకు దిగారు. వైయస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను సమీక్షించాలని జెసి దివాకర్ రెడ్డి వ్యక్తం చేసిన అభిప్రాయంతో వివాదం ముదిరింది. వైయస్ పథకాలన్నీ బోగస్ అని మరో సీనియర్ శాసనసభ్యుడు డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. రవీంద్రా రెడ్డి ఒకప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు. సంక్షేమ పథకాల అమలుపై అధ్యయానికి వేసిన మంత్రివర్గ ఉప సంఘంలో వైయస్ జగన్ ను వేయాలని మరో కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు పి. శంకర రావు సూచించారు. కెవిపి రామచందర్ రావుకు కూడా ఆ కమిటీలో స్థానం కల్పించాలని ఆయన అన్నారు. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సంక్షేమ పథకాలను యధాతథంగా అమలు చేయడం సాధ్యం కాదనే విషయాన్ని జగన్ గ్రహించాలనే విషయాన్ని శంకర రావు పరోక్షంగా చెబుతున్నారని భావించాల్సి ఉంటుంది.

కొత్త పనులు వేయాల్సిన పరిస్థితి లేదని, అందువల్ల సంక్షేమ పథకాలను సమీక్షించాల్సిన అవసరం ఉందని జెసి దివాకర్ రెడ్డి శుక్రవారం మరోసారి అన్నారు. మరింత మంది శాసనసభ్యులు కూడా జెసి వ్యాఖ్యలకు మద్దతుగా ముందుకు వస్తున్నారు. వైయస్ జగన్ కు కౌంటర్ గానే వీరంతా రంగంలోకి దిగినట్లు భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X