తెలంగాణపై ఇప్పుడే చెప్పలేను: పిఎం

ఐపియల్ వివాదంలో ఇద్దరు కేంద్ర మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రస్తావించగా, దానిపై పార్లమెంటులో చర్చ జరిగిందని, ఆర్థిక మంత్రి వివరణ కూడా ఇచ్చారని ఆయన చెప్పారు. హింసను మానితే జమ్మూ కాశ్మీర్ పై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. అవినీతిని సహించబోమని, అవినీతికి పాల్పడినవారు ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలకు వచ్చేదంతా నల్లధనమేననే అభిప్రాయం ఉందని, రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలపై, ఖర్చులపై విస్తృత చర్చ జరగాల్సి ఉందని ఆయన అన్నారు. రాష్ట్రాలతో కలిసి నక్సల్స్ సమస్యను పరిష్కరిస్తామని, రాష్ట్రాలతో నక్సల్స్ సమస్యపై మాట్లాడుతూనే ఉన్నామని ఆయన చెప్పారు. నీటి సమస్యను పరిష్కరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన చెప్పారు. తాను బలహీన పడితే ఇంత అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications