దంతెవాడ: దంతెవాడ మారణకాండతో సంబంధం ఉన్న ఆరుగురు నక్సలైట్లను పోలీసులు అరెస్టు చేశారు. ఏప్రిల్ 6వ తేదీన జరిగిన నక్సలైట్ల దాడిలో 75 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. అరెస్టయి కమాండర్ కు మెరుపుదాడి ప్రణాళిక తెలుసునని దంతెవాడ ఎస్పీ అమరేష్ మిశ్రా అన్నారు. స్థానిక నక్సలైట్లకు సిఆర్పిఎఫ్ జవాన్లు ఏప్రిల్ 5వ తేదీన పోగొట్టుకున్న వైర్ లెస్ సెట్ దొరికిందని, దాన్ని వారు ఆపరేషన్స్ ఇంచార్జీ పాపారావుకు అందించారని, దాంతో పాపారావు దాడికి వ్యూహం రచించాడని ఆయన వివరించారు.
రాత్రంతా ప్రయాణించి విశ్రాంతి తీసుకుంటుండగా సిఆర్పీఎఫ్ జవాన్లపై నక్సలైట్లు దాడి చేశారని, మందుపాతర పేల్చారని, దీంతో ఎదుర్కోవడానికి సిఆర్పీఎఫ్ జవాన్లకు అవకాశం చిక్కలేదని ఆయన అన్నారు.