సాధించాల్సింది చాలా ఉంది: పిఎం

ఆర్థిక మాంద్యం ప్రపంచాన్నంతా కుదిపేసిందని, మన దేశమే త్వరగా కోలుకున్నామని ఆయన చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడమే లక్ష్యమని ఆయన అన్నారు. డిసెంబర్ నాటికి ద్రవ్వోల్బణాన్ని 5 -6 శాతానికి తెస్తామని ఆయన చెప్పారు. 85 శాతం వృద్ధి రేటు సాధించడం తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ధరల పెరుగుదల పెద్ద సవాల్ గా మారిందని, ధరలను అదుపు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. అభివృద్దిపైనే దృష్టి పెడుతున్నామని ఆయన చెప్పారు. ఆహార భద్రతకు చట్టం తెస్తున్నట్లు ఆయన తెలిపారు. వరద, కరువు వల్ల ఆహార ధాన్యాల దిగుబడి తగ్గిందని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల గురించి ఇప్పుడే ఆలోచించడం లేదని ఆయన చెప్పారు. స్పెక్ట్రమ్ లో అవినీతి జరగలేదని, మంత్రి రాజా సరిగానే వ్యవహరించారని ఆయన చెప్పారు. దానికి తానే బాధ్యుడ్ని అని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications