మహబూబాబాద్ ను చుట్టుముట్టిన తెలంగాణవాదులు

వరంగల్ జిల్లావ్యాప్తంగా జగన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. జగన్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని రోడ్లపై జగన్ కు సంబంధించిన ఫ్లెక్సీలను తెలంగాణవాదులు దహనం చేశారు. ప్టటాలపై ఆందోళనకారులు రాళ్లు పెట్టారనే సమాచారంతో రైల్వే అధికారులు అన్ని రైళ్లను ఆపేశారు. ఓ చోట రైల్వై ట్రాక్ కు ఆందోళనకారులు నిప్పు పెట్టినట్లు సమాచారం. జగన్ ప్రయాణిస్తున్న ఇంటర్ సిటీ రైలు ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో నల్లగొండ జిల్లాలోని వంగపల్లి వద్ద ఆగిపోయింది. వరంగల్ లోని నెహ్రూ చౌక్ వద్ద తెలంగాణవాదులు కాంగ్రెసు పార్టీ దిమ్మెను ధ్వంసం చేశారు.












Click it and Unblock the Notifications