మంత్రివర్గ సమావేశానికి మమతా బెనర్జీ డుమ్మా

జార్ఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించడానికి జరిగిన మంత్రివర్గ సమావేశానికి మమతా బెనర్జీ గైర్హాజరయ్యారు. జార్ఖండ్ లో రాష్ట్రపతి పాలన విధిస్తూ రాష్ట్రపతికి సిఫార్సు చేయడానికి జరిగిన సమావేశం చాలా చిన్నదని, తాను అంతకన్నా ముఖ్యమైన పనుల్లో ఉన్నానని ఆమె చెప్పుకున్నారు. తాము యుపిఎలోనే ఉన్నామని, తనకు కొన్ని బాధ్యతలు, విధులు ఉన్నాయని ఆమె చెప్పారు. కేంద్ర హోం మంత్రి పి చిదంబరంతో తనకు సత్సంబంధాలున్నాయని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications