హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పై కాంగ్రెసు అధిష్టానం ఆగ్రహం: కదలికలపై నిఘా

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
హైదరాబాద్: ముఖ్యమంత్రి రోశయ్యపై పార్లమెంటు సభ్యుడు జగన్‌ చేసిన విమర్శలపై అధిష్ఠానం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కె. రోశయ్య, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అమర్యాదకరమైన జగన్ వ్యాఖ్యలను సోనియా గాంధీ, అహ్మద్ ‌పటేల్‌, ప్రణబ్ ‌ముఖర్జీ ల దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. పార్టీలోని ఒక పార్లమెంటు సభ్యుడు ఎన్నడూలేని విధంగా ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధిస్తూ బహిరంగంగా తప్పుబడితే ఎలా? అంటూ అధిష్ఠానానికి ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన అధిష్ఠానం అంతా ముఖ్యమంత్రి వెంటే ఉన్నామన్న సంకేతం బలంగా ప్రజల్లోకి వెళ్లేలా చేయాలని ఆదేశించడంతో మధ్యాహ్నం మంత్రులంతా మీడియా సమావేశం పెట్టి రోశయ్యకు పూర్తిస్థాయి మద్దతు పలికినట్లు తెలుస్తోంది.

జగన్‌కు సోనియా, ప్రణబ్‌లు ఉద్దేశపూర్వకంగానే అపాయింట్ ‌మెంట్‌ ఇవ్వలేదని ఎంపీలు చెబుతున్నారు. జగన్‌ ప్రవర్తనపై వారు నిఘా పెట్టారని, ప్రతి కదలికనూ గమనిస్తున్నారని అంటున్నారు. అతని ప్రవర్తన మారితే తప్ప చేరదీసేది లేదనే ఉద్దేశంతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిపై జగన్‌ చేసిన వ్యాఖ్యలు సోమవారం రాత్రే అహ్మద్‌ పటేల్‌ జగన్ ను హెచ్చరించినట్లు సమాచారం. జగన్ వివరణ ఇచ్చినప్పటికీ ఫలితం కనిపించలేదని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X