ఓదార్పు యాత్రపై వైయస్ జగన్ మల్లగుల్లాలు

శాసనసభ్యులు శ్రీనివాసులు, లబ్బి వెంకటరెడ్డి, ఏరాసు ప్రతాప రెడ్డి తదితరులు జగన్ ను శనివారం కలిసినవారిలో ఉన్నారు. అనంతపురం పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామిరెడ్డి కూడా జగన్ ను కలిశారు. మంత్రి, సమీప బంధువు బాలినేని శ్రీనివాస రెడ్డి జగన్ తో చర్చలు జరిపారు. అధిష్టానం అనుమతితోనే జగన్ ఓదార్పు యాత్ర చేపడతారని శ్రీనివాసులు మీడియా ప్రతినిధులతో అన్నారు.
కాగా, ఓదార్పు యాత్ర వైయస్ జగన్ వ్యక్తిగతమని కాంగ్రెసు శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. పార్టీ అధిష్టానాన్ని జగన్ ఎప్పుడు కూడా ధిక్కరించలేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. యాత్రపై తాను మాట్లాడేది ఏమీ లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications