అధిష్టానంపై ధిక్కారానికి వైయస్ జగన్ సిద్ధం

కాగా, అధిష్టానం అనుమతి వచ్చిన తర్వాతనే యాత్ర చేపట్టడం మంచిదని జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు, నాయకులు అంటున్నారు. పార్టీని కాదని తాము జగన్ కు సహకరించే పరిస్థితి లేదని అంటున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని వారు జగన్ తో స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ స్థితిలో శ్రీకాకుళం జిల్లా ఓదార్పు యాత్రలో జగన్ కు పార్టీ నాయకులు ఏ మేరకు సహకరింస్తారనేది సందేహంగానే ఉంది. వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడైన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు జగన్ యాత్రకు దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications