ఓదార్పు యాత్ర వైయస్ జగన్ ఇష్టం: సిఎం రోశయ్య

ఒకవేళ జగన్ ఓదార్పు యాత్ర చేస్తే భద్రతాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. పార్టీ అధిష్టానం వైఖరి, తదనంతర పరిణామాలను జగన్ ఆలోచించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నట్లు తెలిసింది. జగన్ శ్రీకాకుళం ఓదార్పు యాత్రకు అనుకూలంగా కొందరు మంత్రులు మాట్లాడినట్లు సమాచారం. తెలంగాణలో సెంటిమెంట్ బలంగా ఉంది కాబట్టి వరంగల్ జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర వద్దని తాము చెప్పామని మంత్రులు అన్నట్లు తెలుస్తోంది. కోస్తాంధ్రలో అటువంటి పరిస్థితి లేదని, అందువల్ల జగన్ ఓదార్పు యాత్రకు అనుమతిస్తే పార్టీ పటిష్టమవుతుందని వారు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications