హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మొయిలీ బెదిరించలేదు, మేం బెదరం కూడా: పాల్వాయి

By Pratap
|
Google Oneindia TeluguNews

Palwai Govardhan Reddy
హైదరాబాద్‌: తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ తమను బెదిరించలేదని కాంగ్రెసు సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. మొయిలీ బెదిరించినా తాము బెదరబోమని ఆయన ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను బర్తరఫ్ చేయాలని అడగడానికి తాము గవర్నర్ నరసింహాన్ని కలవలేదని ఆయన అన్నారు. మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశామని, వెళ్లాం కాబట్టి పోలవరం డిజైనింగ్ లో లోపాలున్నాయని చెప్పామని ఆయన అన్నారు. గవర్నర్ అస్పృశ్యుడేమీ కాదని, ప్రభుత్వంలో గవర్నర్ ఒక భాగమని, అందువల్ల గవర్నర్ ను కలవడంలో తప్పు లేదని ఆయన వివరించారు.

పొన్నాల లక్ష్మయ్య మూటలు మోసుకెళ్లాడని తాము ఆరోపించలేదని, నీటి పారుదల శాఖ ఇంచార్జీ కాబట్టి పోలవరం డిజైనింగ్ అలా జరగందనే విషయం పొన్నాల చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు. పోలవరం విషయంలో అధికారులు అలా వ్యవహరించారా, ఏదైనా అదృశ్య శక్తి ఉందా అనేది ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో తేలుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా రోశయ్య పూర్తి కాలం ఉంటారని, రోశయ్యకు తమ పూర్తి సహకారం ఉంటుందని ఆయన చెప్పారు. అవినీతిరహిత, పారదర్శక ప్రభుత్వాన్ని తాము అందిస్తామని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి తామంతా కలిసికట్టుగా పనిచేస్తామని ఆయన అన్నారు. తాము ఎన్నో మంచి పనులు చేసినా గత ఎన్నికల్లో సీట్లు తగ్గాయని, అది మీడియా వల్లనే జరిగిందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X