పెట్రో మంటలు: బెజవాడలో ఎడ్లబండిపై చిరు ప్రయాణం

Chiranjeevi
విజయవాడ : పెట్రో ధరల పెంపునకు నిరసనగా ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి శనివారం విజయవాడలో ఎడ్లబండిపై ప్రయాణించి నిరసన తెలిపారు. పెంచిన పెట్రో ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. పెట్రో ధరలను పెంచడం దారుణమని, సామాన్యుల నడ్డి విరుస్తోందని ఆయన విమర్శించారు. యుపిఎ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్రో ధరలను పెంచుతూ వస్తోందని ఆయన అన్నారు. వంటగ్యాస్ ధర పెంచడం వల్ల మహిళలు కట్టెల పొయ్యి పెట్టుకోవాల్సిన దుస్థితి వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. పెంచిన వంటగ్యాస్ ధరను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ధరలు పెంచడం వల్ల సామాన్యులు పూర్తిగా కష్టాల పాలవుతున్నారని ఆయన అన్నారు. బడా ఆయిల్ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. పెట్రో ధరల పెంపు వల్ల రవాణా చార్జీలు పెరుగుతాయని, దాంతో అన్ని సరుకుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. పెంచిన పెట్రో ధరలను తగ్గించే వరకు తమ పోరాటం సాగుతుందని ఆయన చెప్పారు. తమకు ప్రజల మద్దతు ఉందని, ఆ ప్రజాబలంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+