ఎదురు 'గాలి': ఎన్నికల కమిషన్ నోటీసులు

"ఆదివారం బెంగళూరులోనే వీటిని మంత్రులకు అందజేయాలని మా సిబ్బంది ప్రయత్నించినా కుదరలేదు. సోమవారం ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలకు వారు వస్తారని భావిస్తున్నాం. రానిపక్షంలో బళ్లారి కలెక్టర్ ద్వారా వీలైనంత త్వరగా అందజేస్తాం" అని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ఒకరు చెప్పారు. "నోటీసులు సీల్డ్ కవర్లలో ఉన్నందున సారాంశం మాకు తెలియదు. పేజీల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. శాసన సభ్యత్వం నుంచి ఎందుకు తొలగించరాదో సంజాయిషీ అడిగి ఉంటారు" అన్నారు. సంజాయిషీ వ్యవధి వారం రోజులు ఉండవచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications