సమాధానం చెప్పలేక దాడులు: రోశయ్యపై హరికృష్ణ

ప్రజాప్రతినిధుల ఇళ్లపై అధికార పార్టీ కార్యకర్తలే దాడులు చేయడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. ఈ దాడికి రోశయ్య సమాధానం చెప్పాలని, దానికి రోశయ్యనే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ప్రతిపక్షాల నేతలపై దాడులు జరుగుతుంటే ఇది రాక్షస పాలన కాకుంటే మరేమవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే అవి నిజం కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత అధికార పార్టీకి ఉంటుందని, కానీ కాంగ్రెసు పార్టీవారు దాడులకు దిగుతున్నారని ఆయన అన్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావించినప్పుడు, ప్రజల బాధలను చెప్పినప్పుడు ప్రతిపక్షాల నేతలపై దాడులు చేయడం కాంగ్రెసు సంప్రదాయమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications