బిజెపి నేత కిషన్ రెడ్డి నిరవధిక నిరశన దీక్ష షురూ

కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫీజుల రీయంబర్స్ మెంట్ బాకీలను వెంటనే చెల్లించాలని కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ నిర్ణయం మేరకే తాను నిరశన దీక్ష చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదే సమస్యపై ఆమరణ నిరాహార దీక్ష సాగిస్తున్న బిసి సంఘం నేత ఆర్. కృష్ణయ్యకు కిషన్ రెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రతిపక్షాలు ఎంతగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తప్పనిసరి పరిస్థితిలోనే తాను దీక్షకు దిగుతున్నానని ఆయన చెప్పారు. ప్రభుత్వం దిగి రాకపోతే తమ ఉద్యమం మరింత ఉధృతమవుతుందని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications