బెంగళూరు: తాను ఇంటర్నెట్‌లో అత్యధికంగా వీక్షించిన వ్యక్తిని అయ్యానని చెప్పుకున్నాడు ఇటీవల అత్యాచారం ఆరోపణలపై అరెస్టయి విడుదలైన స్వామీజీగా చెప్పుకునే నిత్యానంద సంబరపడిపోయారు. అత్యాచారం ఆరోపణలపై 53 రోజులపాటు జైలులో గడిపిన తర్వాత ఇటీవల నిత్యానందను విడుదల చేశారు.
తమిళ నటి రంజితతో నిత్యానంద లైంగిక కార్యకలాపాలు నిర్వహిస్తూ చిక్కిన వీడియో టేప్‌లు దేశంలో సంచనం సృష్టించగా, నిత్యానంద కేసు ఇంటర్నెట్‌లో అత్యధికంగా వీక్షించిన కుంభకోణంగా మారింది.