డి శ్రీనివాస్ పై భగ్గుమన్న కె చంద్రశేఖర రావు

K Chandrasekhar Rao
హైదరాబాద్‌: 'తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగనున్న నియోజక వర్గాల్లో రాజీనామా చేసిన అభ్యర్థులే తిరిగి గెలువనున్నారు. ఎన్నికలపై సర్వేలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. నిజామాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ను ఓడించాలి. తెలంగాణ ప్రజల సత్తా చూపించాలి. ఢిల్లీ గుండె గుభేల్‌మనాలి. సోనియాగాంధీ కళ్లు తెరిపించాలి. తెలంగాణ నాయకులకు పౌరుషం లేకపోయినా ప్రజల పౌరుషాన్ని చూపించాలి' అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాసః) అధ్యక్షులు కె చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. సోమవారమిక్కడ తెలంగాణ భవన్‌లో కోరుట్ల నియోజక వర్గానికి చెందిన తెదేపా నాయకులు వడ్డేపల్లి లక్ష్మి, రాజయ్య, శ్రీనివాస్‌ తదితరులు కేసీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ రాబోయే ఉప ఎన్నికల కోసం డబ్బులు, మద్యం తదితర సరంజామా సిద్ధం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇటీవల టిడిపికి చెందిన రూ. ఏడు కోట్లు అధికారుల తనిఖీలో పట్టుబడ్డాయని చెప్పారు. కోరుట్లలో మాజీ ఎమ్మెల్యే రత్నాకర్‌ రావు పోటీ చేయడం మానుకోవాలనీ, తెలంగాణ వచ్చే సమయంలో ఉద్యమకారులను ప్రోత్సహించాల్సిన ఆయన రాజకీయాల కోసం ఆరాట పడుతున్నారన్నారు.

డిసెంబరు 9న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణను అడ్డుకున్న మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడేనని, ఆయన రోశయ్యతో కూడబలుక్కుని రాజీనామాలు చేయించారన్నారు. శాసనసభ సాక్షిగా టిడిపి, కాంగ్రెస్‌ నేతలు కలిసిపోయారనీ ఆయన అన్నారు. తెలంగాణను ముంచేందుకు వారు ఎంతకైనా సిద్ధపడతారనడానికి ఇదో నిదర్శనమన్నారు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌, టిడిపి ఏం ముఖం పెట్టుకొని పోటీ చేస్తాయని ప్రశ్నించారు. ప్రజలకు వీరేం సమాధానం చెప్తారన్నారు. తెలంగాణకు ఇక్కడున్న దద్దమ్మ నేతలే శాపమన్నారు. తెలంగాణలో ఉన్న వాల్మీకి బోయలు బీసీలుగా ఉన్నారని, అదే ఆంధ్రలో ఎస్టీలుగా గుర్తింపు ఇచ్చారని, తెలంగాణలో మాలి కులస్థులను బీసీలుగా, ఆంధ్రలో ఎస్సీలుగా గుర్తించారన్నారు. తెలంగాణ ఏర్పడితే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు వస్తాయన్నారు. పోలవరం డిజైన్‌ మార్చాలని ఆంధ్రప్రాంత ఇంజనీర్లు సైతం చెబుతున్నా, ముఖ్యమంత్రి రోశయ్య మాత్రం సాధ్యం కాదనడం దారుణమన్నారు. కార్యక్రమంలో కోరుట్ల మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+