బిజెపి నేత కిషన్ రెడ్డి అరెస్టు, దీక్ష భగ్నం

Kishan Reddy
హైదరాబాద్‌: పేద విద్యార్థుల బోధనా ఫీజుల చెల్లింపుల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా సోమవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన వేదికపై దీక్షలో కూర్చున్న ఆయన్ను రాత్రి అరెస్టు చేసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కిషన్‌రెడ్డి అరెస్టును అడ్డుకున్న బిజెపి నేతలు బండారు దత్తాత్రేయ, వెంకట్‌రెడ్డి, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ తదితరులనూ అరెస్టు చేసి గాంధీనగర్‌, నాంపల్లి పోలీసుస్టేషన్లకు తీసుకెళ్లారు. అంబులెన్స్‌కు అడ్డుపడిన యువమోర్చా కార్యకర్తలను వచ్చినవారిని వచ్చినట్లుగా వ్యాన్లలో తరలించారు. తనను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి దీక్ష భగ్నం చేశారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆస్పత్రిలో చేర్పించినా దీక్ష కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు కిషన్ ‌రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోందన్న వైద్యుల సలహా మేరకే ఆయన్ను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

కిషన్‌ రెడ్డి దీక్ష ప్రారంభించడానికి ముందే పోలీసులు బిజెపి నేతలతో చర్చలు జరిపారు. దీక్షకు అనుమతి లేదని, విరమించుకోవాలని కోరారు. కానీ వారు అందుకు అంగీకరించలేదు. మధ్యాహ్నం 12:30 గంటలకు కిషన్ ‌రెడ్డి దీక్షలో కూర్చున్నారు. అనంతరం ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. కార్యకర్తలు వేదిక ముందు బైఠాయించి వారిని ప్రతిఘటించారు. తమ నాయకుడిని అరెస్టు చేస్తే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకు పోలీసులు, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గారు. తర్వాత నేతల ప్రసంగాలకు లౌడ్‌స్పీకర్లకు అనుమతి లేదంటూ మైకులు కట్‌ చేయడంతో భాజపా నేతలు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, కాసం వెంకటేశ్వర్లు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా తమ నాయకుడు దీక్ష చేపడితే అడ్డుకోవడం తగదని ధ్వజమెత్తడంతో ముఖ్యనేతల ప్రసంగాల వరకు మైక్‌కు అనుమతిచ్చారు. చివరకు సోమవారం రాత్రి కిషన్ రెడ్డిని అరెస్టు చేసి, దీక్ష భగ్నం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+