హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి మద్య నియమత్రణ చిట్కాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్‌: రాష్ట్రంలో మద్య నియంత్రణ కోసం తన వంతు పాత్ర పోషించేందుకు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి సిద్ధమవుతున్నారు. ఈ దిశగా ప్రజలను చైతన్య పరిచేందుకు వీలుగా పార్టీ అధినేత చిరంజీవి స్వయంగా ఇచ్చిన సందేశాలతో కూడిన క్యాసెట్లతో గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. అందుకు అవసరమైన కరపత్రాలు, పోస్టర్లు కూడా తయారు చేయాలని ప్రజారాజ్యం పార్టీ తీర్మానించింది. ఈ రూపంలో మద్య నియంత్రణకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని యోచిస్తోంది. మంగళవారం ప్రరాపా కార్యాలయంలో చిరంజీవి ఆధ్వర్యంలో సీనియర్లు, శాసనసభ్యుల సమావేశం జరిగింది. ఇందులో మద్య నియంత్రణపై చర్చించారు. మద్యపాన దుష్ఫలితాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం నియమించిన ప్రచార కమిటీ ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించడం లేదని నేతలు విమర్శించారు. ఇందుకోసం పార్టీయే చొరవ తీసుకోవాలని వారు సూచించారు. ఈ మేరకు చిరంజీవి సందేశాలతో కూడిన క్యాసెట్లు, పోస్టర్లు, కరపత్రాలు రూపొందించి, ప్రచారం మొదలుపెట్టాలని తీర్మానించారు.

ప్రజా సమస్యలపై వీలైనంతమేరకు చిరంజీవి జిల్లాల్లో పర్యటనలు జరిపేలా కార్యక్రమాలు రూపొందించాలని నిర్ణయించారు. దీనికోసం సీనియర్‌ నేత జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు మండల, పట్టణ స్థాయిల్లో కమిటీలు వేయాలని యోచిస్తున్నారు. అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులతో వచ్చే నెల 2న ఒక సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. పోలవరం టెండర్ల రద్దు వెనక రాజకీయ కారణాలు ఉండవచ్చని సమావేశంలో పాల్గొన్న నేతలు ప్రస్తావించారు. దీనిని త్వరగా పూర్తి చేసేలా జాతీయహోదా ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని తీర్మానించారు. విశాఖ జిల్లా రాంబిల్లి మండలంలో నౌకాదళ స్థావరంతో నిర్వాసితులవుతున్న వారికి న్యాయం జరిగేలా ఉత్తరాంధ్ర నాయకులతో కూడిన ప్రతినిధి బృందాన్ని కేంద్ర రక్షణ మంత్రి ఆంటోని వద్దకు పంపాలని వారు సూచించారు. వైఎస్‌ సీఎంగా ఉండగా సంక్షేమ రంగానికి కోత పెట్టి, జలయజ్ఞం పేరుతో అనేక ప్రాజెక్టులను ఒకేసారి చేపట్టడం వల్లే బీసీ విద్యార్థులకు నిధుల కొరత ఎదురైందని ప్రరాపా నేతలు అభిప్రాయపడ్డారు. విత్తన కొరత, రుణ లభ్యత లేకపోవడంతో ఆశించిన స్థాయిలో పంటలు సాగు కావటం లేదని నాయకులు ప్రస్తావించారు. ఏజెన్సీలో విస్తరిస్తున్న వ్యాధులు, ఉద్ధృతమవుతున్న స్వైన్‌ఫ్లూపై ప్రభుత్వం సరైనరీతిలో స్పందించడం లేదని విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X