న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం తెల్లవారు జామున రెండు అంతస్థుల భవనం కూలి ఆరుగురు మరణించారు. భవనం శిథిలాల కింద మరింత మంది కూరుకుపోయి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. దాదాపు నాలుగున్నర గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఉస్మాన్ పూర్ సమీపంలోని బ్రహ్మపురిలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది.
శిథిలాల కింది నుంచి సహాయ బృందాలు ముగ్గురు పురుషులు, ముగ్గురు స్తీల శవాలను వెలికి తీశారు. సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.