ఇప్పుడే ఎక్కువగా చెప్పలేను: సోంపేట ఘటనపై రోశయ్య

కాగా, సోంపేట ఘటనపై హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం హైదరాబాదులో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆందోళనకారులు పోలీసులపై దాడి చేశారని, దాడిలో 25 మంది పోలీసులు గాయపడ్డారని ఆయన అన్నారు. కాల్పుల్లో ఒక్క వ్యక్తి మాత్రమే మరణించినట్లు ఆమె మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. మృతుడి శవంతో ఆందోళనకారులు పోలీసు స్టేషను వద్ద ధర్నా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. పోలీసులను వెనక్కి రావాలని పిలిచినట్లు ఆమె చెప్పారు. సంయమనం పాటించాలని పోలీసులను ఆదేశించామని ఆమె చెప్పారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేశారని ఆమె అన్నారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications