ప్రజలు నా వెంటే ఉన్నారు: ఓదార్పులో వైయస్ జగన్

YS Jagan
కాకినాడ: ప్రజలు తన వెంటే ఉన్నారని కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అన్నారు. జగన్ 16వ రోజు శుక్రవారం ఓదార్పు యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. తాటిపాక జంక్షన్ లో ప్రజలు ఆయనకు స్వాగతం చెప్పారు. తాటిపాక జంక్షన్ వద్ద ఆయన వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. తమ ప్రియతమ నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో ఉన్నారని ఆయన అన్నారు.

ప్రజల గుండె లబ్ డబ్ అని కొట్టుకోకుండా వైయస్సార్ వైయస్సార్ అని కొట్టుకుంటోందని ఆయన అన్నారు. వైయస్ ఎక్కడికీ వెళ్లిపోలేదని, ప్రజల గుండెల్లో ఉన్నారని ఆయన అన్నారు. వైయస్ తనకు పెద్ద కుటుంబాన్ని, ప్రజల గుండెల్లో చోటునిచ్చి, జనం మధ్యనే ఉన్నారని జగన్ అన్నారు. గత 9 నెలలుగా తన వెంట ఎవరు ఉన్నా లేకున్నా ప్రజలు మాత్రం ఉన్నారని ఆయన అన్నారు. అందుకే తాను చిరునవ్వుతో ప్రజల ముందుకు రాగలుగుతున్నానని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+