జగన్ సోనియా గాంధీ పేరెత్తకపోవడంలోని ఆంతర్యం?

పావురాలగుట్టలో వైయస్ సంతాప సభలో సోనియా పేరును ప్రస్తావించకపోవడం విమర్శలకు కూడా గురైంది. వైయస్ మరణానంతరం హైదరాబాద్ వచ్చి ప్రత్యేకంగా నివాళులు అర్పించినందుకైనా జగన్ సోనియాకు, రాహుల్ కు కృతజ్ఞతలు చెప్పాల్సి ఉండిందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఆ అభిప్రాయాన్ని ఆయన పట్టించుకోలేదు. ఆ తర్వాత జరిగన ఓదార్పు యాత్రల్లో జాతీయ నేతల పేరు ప్రస్తావించడం లేదు. వైయస్ ఆశయాలను సాధిస్తానని మాత్రమే చెబుతున్నారు. తద్వారా వైయస్ ను కాంగ్రెసు నుంచి వేరు చేసే ప్రయత్నం జగన్ చేస్తున్నారని అంటున్నారు. వైయస్ వారసత్వాన్ని కాంగ్రెసు వారసత్వానికి దూరంగా పెడుతున్నారు. కాంగ్రెసు పార్టీని చీల్చి కొత్త పార్టీ పెట్టాలనే ఉద్దేశం ఉన్నందు వల్లనే జగన్ కాంగ్రెసు నాయకుల పేర్లను ప్రస్తావించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications