న్యూఢిల్లీ: సిబీఐ ధికారులు తమ సత్తా చాటుకున్నారు. గుజరాత్ మాజీ హోంమంత్రి అమిత్ షాను ఆదివారం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. సోహ్రాబుద్దీన్ కల్పిత ఎన్‌కౌంటర్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన గత మూడు రోజులుగా అజ్ఞాతంలో గడిపిన విషయం తెలిసిందే. ఆయన నేడు మీడియా ముందుకు వ చ్చారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. ఆ తర్వాత సీబీఐ అధికారులు రంగ ప్రవేశం చేసి అమిత్ షాను అదుపులోకి తీసుకున్నారు.