బాబ్లీ ప్రాజెక్టుపై ప్రధాని ఏ మాటా ఇవ్వలేదు, చిత్తుశుద్ధి లేదు: బాబు

తాము ఇదివరకు రెండుసార్లు వినతిపత్రాలు సమర్పించామని, మరో రెండుసార్లు అఖిలపక్ష బృందం వచ్చి సమస్యను వివరించిందని, కానీ ఇంతవరకూ ఆయనకు సమస్యను తెలుసుకొనేందుకు అధికారుల సమావేశం ఏర్పాటుచేసుకొనే సమయం కానీ ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటుచేసే వెసలుబాటుకానీ లేకపోయిందని ఆయన అన్నారు. బాబ్లీ విషయంలో ప్రధానమంత్రి దేనిపైనా హామీ ఇవ్వలేదని, ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటుచేస్తామని మాత్రం చెప్పారని, తేదీ అడిగితే ప్రధాని నుంచి కచ్చితమైన సమాధానం రాలేదని, దీన్ని బట్టి ఆయన ఈ అంశాన్ని సాగదీయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. తమను ఐదు రోజుల పాటు మహారాష్ట్ర పోలీసులు నిర్బంధిస్తే దాన్ని ప్రధాని ఖండించలేదని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications