నిజామాబాద్ లో టీవీ చానెళ్ల నిలిపివేత: హైకోర్టులో సవాల్
State
oi-Pratapreddy
By Pratap
హైదరాబాద్: నిజామాబాద్ లో ఎన్నికల సంఘం టీవీ చానెళ్ల ప్రసారాలను నిలిపేసింది. నిజామాబాద్ అర్బన్ శాసనసభా సీటుకు ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో సోమవారం ఇసి ఈ చర్యకు పాల్పడింది. ఓటర్లను ప్రభావితం చేయడానికి వీలుందనే అభిప్రాయంతో ఇసి టీవీ చానెళ్ల ప్రసారాలను నిలిపేసినట్లు తెలుస్తోంది. అయితే, తమ చానెల్ ప్రసారాలను మాత్రమే నిలిపేశారని రాజ్ న్యూస్ అంటోంది. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఇసి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) కన్వీనర్ శర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీవీ చానెళ్ల ప్రసారాలను నిలిపేయడం అన్యాయమని ఆయన అన్నారు.