వైయస్ జగన్ వ్యవహారంపై రంగంలోకి హైకమాండ్

తమను మాటను ధిక్కరించి జగన్ వరంగల్ జిల్లాలో ఓదార్పు యాత్రకు బయలుదేరడం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటించిన నేపథ్యంలో హైకమాండ్ రంగంలోకి దిగనున్నట్లు చెబుతున్నారు. ఓదార్పు యాత్రల్లో వైయస్ జగన్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేరును కనీసంగా ప్రస్తావించకపోవడంలో ఆంతర్యాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే, వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన క్షణం నుంచి జగన్ పావులు కదపడానికి చేసిన ప్రయత్నాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. జగన్ తనంత తానుగా వెళ్లిపోయే వరకు నిరీక్షించాలా, జగన్ పై చర్యలు తీసుకోవాలా అనే విషయాలపై కూడా హై కమాండ్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications