హుస్సేన్ సాగర్ లో పడిపోయిన కారు: ప్రయాణికులు సురక్షితం

ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు అదుపు తప్పి ఫుట్ పాత్ ను ఢీకొట్టి హుస్సేన్ సాగర్ లో పడిపోయింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు కూడా వాసవి కళాశాలలో బికాం చదువుతున్నారు. ఇద్దరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వివేక్ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. పెద్ద యెత్తున ప్రజలు గుమికూడడంతో వారిని పోలీసులు చెదరగొట్టారు.












Click it and Unblock the Notifications