బంగాళాఖాతంలో వాయుగుండం: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

పశ్చిమగోదావరి జిల్లాలో కురుస్తున్న వానలతో కొవ్వాడ జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు లోతట్లు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలోని బుట్టయగూడెం, జగన్నాథపురంలో భారీ వర్షంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో భారీవర్షానికి గోదుమవాగు పొంగిపొర్లుతోంది. రామవరంలో వరద నీటిలో వంతెన నీటమునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. జలాశయంలో ఇన్‌ఫ్లో 36 వేల క్యూసెక్కులుగా ఉండగా, ప్రస్తుత నీటి మట్టం 834.20 అడుగులుగా ఉంది.












Click it and Unblock the Notifications