పార్టీకి చిరంజీవి ప్రాణం పోయడం సాధ్యమైనా?

రోజుకు రెండు జిల్లాల నాయకులతో చిరంజీవి చర్చలు జరుపుతారు. సోమవారం ఉదయం నెల్లూరు, మధ్యాహ్నం చిత్తూరు, మంగళవారం ఉదయం కడప, మధ్యాహ్నం ఖమ్మం, బుధవారం ఉదయం శ్రీకాకుళం, మధ్యాహ్నం విజయనగరం జిల్లాల నాయకులతో చిరంజీవి సమావేశాలను తలపెట్టినట్లు పార్టీ కార్యక్రమాల కమిటీ అధ్యక్షుడు జ్యోతులనెహ్రూ తెలిపారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న అన్ని జిల్లాల మహిళా నేతలు, కార్యకర్తలతో 5వ తేదీ ఉదయం 11 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తారని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications