ఇక వైయస్ జగన్ ఢిల్లీ మంత్రాంగం: పెద్దలతో భేటీ?

తన ఢిల్లీ పర్యటనలో జగన్ పార్టీ వ్యవహారాలపై అధిష్టానానికి చెందిన నాయకులతో చర్చించే అవకాశాలున్నాయి. ప్రధానంగా ఆయన పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో సమావేశమవుతారని భావిస్తున్నారు. పార్టీ సీనియర్లపై, తన ఓదార్పు యాత్ర ఉద్దేశ్యంపై ఆయన మొయిలీకి వివరించే అవకాశాలున్నాయి. అలాగే, తనను బలపరుస్తున్న అంబటి రాంబాబుపై సస్పెన్షన్ వేటు వేసిన వ్యవహారంపై కూడా ఆయన మాట్లాడే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications