వైయస్ జగన్ వర్గంపై మరో వేటు: గట్టుకు ఉద్వాసన

పార్టీ అప్పజెప్పిన కిసాన్ సెల్ బాధ్యతలను విస్మరించి, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే కార్యక్రమాలలో నిమగ్నమవుతున్నందుకు గాను ఈ చర్య తీసుకుంటున్నట్లు ఆయనకు తెలిపారని తెలిసింది. అయితే కిసాన్ సెల్ కార్యక్రమాలను వదిలేసి, అధిష్ఠానంపై విమర్శలు గుప్పించడం, మీడియాలో అదే పనిగా పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం వల్లే ఈ వేటు పడినట్టు పార్టీ వర్గాలు వివరించాయి. గట్టుపై చర్య విషయాన్ని అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. అయితే గట్టుకు లిఖితపూర్వకమైన ఆదేశాలు వెళ్లలేదని అంటున్నారు.
వైయస్ జగన్ కు తొలి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న అంబటి రాంబాబుపై సస్పెన్షన్ వేటు వేసి పక్షం రోజులు కూడా గడవక ముందే గట్టు రామచందర్ రావుపై చర్య తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీన్ని బట్టి జగన్ వర్గానికి చెందినవారిని హడావిడి లేకుండా పక్కకు తప్పించే పనికి కాంగ్రెసు నాయకత్వం పూనుకున్నట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications