మారిన పొలిటికల్ సీన్: చిరంజీవి వర్సెస్ వైయస్ జగన్

చిరంజీవి ఆరోపణలు చేయడంతో వాటిని పట్టించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. చిరంజీవి ఆరోపణలు గతంలో మాదిరిగా కాకుండా చాలా తీవ్రంగా ఉన్నాయి. దాంతో జగన్ వర్గం ఇరకాటంలో పడింది. పైగా చిరంజీవి కాంగ్రెసు పార్టీకి దగ్గరవుతూ వస్తున్నారు. జగన్ వల్ల జరిగే నష్టాన్ని చిరంజీవితో పూడ్చుకోవడానికి ఇప్పటికే కాంగ్రెసు అధిష్టానం ఓ అవగాహనకు వచ్చింది. ఆ రకంగా యుద్ధాన్ని జగన్, చిరులకు మధ్య జరిగే విధంగా కాంగ్రెసు అధిష్టానమే వ్యూహం రచించిందనే ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications