వైయస్ రాజశేఖర రెడ్డి భూలావాదేవీలపై డిఎల్, జెసి పరోక్ష దాడి

ఎపిఐఐసి కొద్ది మంది జేబు సంస్థగా మారిందని ఆయన విమర్శించారు. 2004 నుంచి ఎపిఐసిసి లావాదేవీలపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎపిఐసిసి వద్ద ఒక్క రూపాయి కూడా లేదని, పూర్తిగా దివాళా తీసిందని ఆయన అన్నారు. ఎంఆర్ ప్రాపర్టీస్ కు అప్పగించిన భూముల విషయంలో ఎపిఐసిసి వాటాను పూర్తిగా తగ్గించేశారని ఆయన అన్నారు. నానక్ రాం గూడాలో పెద్ద యెత్తున భూకుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. ఎపిఐసిసి వ్యవహారాలపై విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారని ఆయన అన్నారు. ఈ భూముల వ్యవహారంపై గతంలో తమ పార్టీ దివంగత నేత పి. జనార్దన్ రెడ్డి కూడా పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ భూముల వ్యవహారంలో ఎవరెవరు లాభపడ్డారో బయటకు తీయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications