సీమాంధ్ర మంత్రులను డిస్మిస్ చేయాలి: జీవన్ రెడ్డి

గత తొమ్మిది నెలలుగా సీమాంధ్ర మంత్రులు తెలంగాణలో పర్యటించడం లేదని, కొత్తగా వారిని తిరగనివ్వకపోవడం అనే విషయం ప్రస్తావనకే రాదని ఆయన అన్నారు. తెలంగాణ ఉప ఎన్నికల్లో ప్రచారం చేసే నైతిక స్థయిర్యం కూడా వారికి లేకుండా పోయిందని ఆయన అన్నారు. సీమాంధ్ర మంత్రులు పూర్తిగా నైతిక స్థయిర్యం కోల్పోయారని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి గాదె వెంకటరెడ్డి వితండ వాదం చేస్తారని ఆయన అన్నారు. అబద్ధాన్ని కప్పి పుచ్చుకోవడానికి మరో అబద్ధాన్ని గాదె వెంకట రెడ్డి చేస్తారని, అదే వితండ వాదమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications