వైయస్ జగన్ ను కాంగ్రెసు నుంచి పంపించేందుకు కుట్ర: ఎమ్మెల్యేలు

రాష్ట్రంలో వైయస్ రాజశేఖర రెడ్డిని అభిమానించే వాళ్లు కోట్లాది మంది ఉన్నారని, వారంతా సైకోలా అని ఆయన అన్నారు. వైయస్ అభిమానులను సైకో ఫ్యాన్స్ అని డిఎల్ రవీంద్రారెడ్డి శాడిస్టులా మాట్లాడారని ఆయన వ్యాఖ్యానించారు. ఎపిఐఐసిపై ఐదేళ్లుగా రాని అనుమానాలు ఇప్పుడే వచ్చాయా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం కొనసాగాలని, తాను కాంగ్రెసు పార్టీలో ఉండాలని జగన్ భావిస్తున్నారని ఆయన చెప్పారు.
కడప జిల్లా పేరును మార్చడాన్ని డిఎల్ రవీంద్రా రెడ్డి రాజకీయం చేస్తున్నారని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. ఆరోపణలు, విమర్శల ద్వారా ముఖ్యమంత్రి రోశయ్యకు దగ్గర కావచ్చునని డిఎల్, జెసి భావిస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ పేరును అప్రతిష్టపాలు చేయడానికి కాంగ్రెసులోనివారే విపక్షాలతో చేతులు కలిపుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications