హైదరాబాద్: హైదరాబాదులో బుధవారం పట్టపగలు దోపిడీ జరిగింది. హైదరాబాదులోని ఎల్బీ నగర్ లోని ఓ మెడికల్ స్టోర్ ఉద్యోగిపై దాడి చేసి 30 వేల రూపాయల నగదు ఎత్తుకుపోయారు. రివాల్వర్ తో, కత్తితో దుండగులు అతన్ని బెదిరించారు. కత్తితో మెడికల్ స్టోర్ లో ఉన్న హరిప్రసాద్ కు గాటు పెట్టారు.
దుండగుల దాడిలో గాయపడిన హరిప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.