హైకమాండ్ పూర్తి స్థాయి సమరం: జగన్ వర్గంలో కలవరం

కొండా సురేఖ, అంబటి రాంబాబు వంటి జగన్ వర్గీయులపై చర్యలు పూనుకుని పరీక్షించిన హైకమాండ్ ఇప్పుడు నేరుగా జగన్ ను టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణాన్ని శాసనసభ్యులు డిఎల్ రవీంద్రా రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి బయట పెట్టినట్లు భావిస్తున్నారు. పలు ఆర్థిక అక్రమాలకు సంబంధించిన చిట్టా కూడా అధిష్టానం వద్ద ఉన్నట్లు సమాచారం. 2004-09 మధ్య జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయించాలంటూ ఆధారాలు జత చేస్తూ అధిష్టానానికి ఫిర్యాదులు పంపుతున్నారు. ఇప్పటికీ బయ్యారం గనులు, రామగుండం జాతీయ రహదారి పనులు, ఎమ్మార్ ప్రాపర్టీస్, రహేజా వ్యవహారాలపై ఫిర్యాదులు అందాయి. ఏపీఐఐసీలో అక్రమాలపై విచారణకు మాజీ మంత్రులు డీఎల్, జేసీ డిమాండ్ చేశారు. అప్పట్లో పరిశ్రమల శాఖను చూసిన మంత్రి బొత్స సత్యనారాయణ ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications