టిడిపి తెలంగాణ ఎమ్మెల్యేలకు ఒయు జెఎసి హెచ్చరిక

విద్యార్ధులపై కేసుల ఎత్తివేత తమ చేతుల్లో లేదని కేంద్ర హోంమంత్రి చిదంబరం పేర్కొనడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటనలో తెలంగాణ వస్తుంది, విద్యార్ధులపై కేసులు ఎత్తివేస్తామని చెప్పిన చిదంబరం ఇప్పుడు మాట మార్చడం సబబు కాదని విద్యార్ధి నాయకులు అన్నారు. మాటపై నిలకడలేని ఈ ప్రభుత్వం మాటలను ఇక ముందు ఎలా నమ్ముతామని వారు ప్రశ్నించారు. చిదంబరం వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇక తెలంగాణ రాదుస, విద్యార్ధులపై కేసులు ఎత్తివేయడం జరగదని స్పష్టమైందన్నారు. ఏమి జరిగినా బయపడేది లేదని, విద్యార్ధులపై కేసులు ఎత్తివేసి, ప్రత్యేక తెలంగాణ వచ్చేవరకు ఉద్యమం చేస్తామని వారు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications