కడప: కడప జిల్లాలోని మైదుకూర్‌లో మద్యం వ్యాపారాలు బరితెగించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు మద్యం అమ్మొద్దన్న విచక్షణను మరచి, వైన్‌షాపులను బార్లా తెరిచారు. పట్టపగలే యథేచ్ఛగా మద్యం అమ్మకాలు సాగించారు. దీని తెలుసుకొని వార్తా సేకరణకు వెళ్లిన విలేకరులపై మద్యం వ్యాపారులు దాడి చేశారు. మద్యం వ్యాపారుల వికృతాన్ని చిత్రీకరించడానికి వెళ్లిన సాక్షి టీవీ ప్రతినిధిపై దాడి చేశారు. దీంతో ఆయనకి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. మరికొన్ని టీవీ ఛానెల్ల ప్రతినిధులపై కూడా మద్యం వ్యాపారులు విరుచుకపడ్డారు.
విలేకరులపై దాడిని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిచాయి. అక్రమంగా మద్యం విక్రయాలు చేయడమే కాకుండా, దీనిని వెలుగులోకి తేవడానికి వెళ్లిన విలేకరుపై దాడికి తెగబడటం దారుణమని జర్నలిస్టు సంఘాల నేతలు అన్నారు.