విశాఖపట్నం: క్యుములోనింబస్ ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిషా నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని... దీని కారణంగా పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది.