కాశ్మీర్ లో శాంతి కోసం కృషి: ప్రధాని మన్మోహన్ సింగ్

 Manmohan Singh
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి గ ల్లీ వరకు, ప్రతిచోటా మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. జాతియావత్తు 64వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంది. ఎర్రకోటపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ జాతీయ జేండాను ఎగురవేశారు. ఎర్రకోటపై వరుసగా ఏడోసారి తివర్ణ పతకాన్ని ఎగురవేసి, మన్మోహన్‌సింగ్‌ రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీతో పాటు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు హాజరయ్యారు.

దేశం కోసం ప్రాణాలర్పించిన జవాను అమరవీరులకు ప్రధాని జోహర్లు అర్పించారు. దేశ రక్షణలో సైనికుల కృషి ఎనలేనిదని కొనియాడారు. జమ్ముకాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేశారు. కాశ్మీర్‌లో శాంతి కోసం ఎవరితోనైనా చర్చిస్తామని తెలిపారు. పాకిస్థాన్‌ ఉగ్రవాదంపై పోరు జరపాల్సిందేనని స్పష్టం చేశారు. లేకపోతే ఇరుదేశాల చర్చల ప్రక్రియలో పురోగతి ఉండదని స్పష్టం చేశారు. పెరిగిన ధరలు సామాన్యుడికి భారంగా మారాయని ప్రధాని అంగీకరించారు. ధరలను త్వరలో అదుపు చేస్తామని జాతికి హామీనిచ్చారు. నక్సలిజం దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా మారిందని, నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక సంఘం సమగ్ర విధానాన్ని రూపొందిస్తోందన్నారు. లెహ్‌లో సంభవించిన వరదలతో భారీ నష్టం జరిగిందని తెలిపారు. ఈ వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని సంతాపం తెలిపారు. నవభారత నిర్మాణం కోసం అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+