సీమాంధ్ర మంత్రులు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: కెకె
State
oi-Santaram
By Santaram
హైదరాబాద్: సీమాంధ్ర, తెలంగాణ వివాదం తీవ్రమవుతోంది. తెలంగాణ కోరేవారంతా దేశద్రోహులంటూ సీమాంధ్ర మంత్రులు చేసిన ప్రకటనను తక్షణం వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత కేశవరావు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులపై కేసులను ఉపసంహరించుకునేంత వరకు పోరాటం విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణను సాధించేందుకు నేతలంతా కలిసి పోరాటం చేయాలని శనివారం పార్టీ సీనియర్ నేతుల, ఎంపీలతో జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. నవంబర్1న జరుపుకునే రాష్ట్రావాతరణ దినోత్సవాల్లో తెలంగాణ అంతటా తెలంగాణ జెండాలు ఎగురవేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. తెలంగాణ సాధించుకునే దిశగా పోరాటం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఓ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసేలా నిర్ణయించామని వెల్లడించారు.