హైదరాబాద్: రాష్ట్ర ఫుట్‌బాల్ సమాఖ్య రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ఇప్పటిదాకా సీఆర్ విశ్వనాథ్ నేతృత్వంలో పునర్‌నిర్మాణ కమిటీ కార్యకలాపాలు సాగిస్తుండగా... తాజాగా భారత ఫుట్‌బాల్ సమాఖ్య దీన్ని రద్దుచేసింది. దీని స్థానంలో ఎంపీ వి. హనుమంతరావు నేతృత్వంలో తాత్కాలిక కమిటీని నియమించింది. ఇకపై రాష్ట్రంలో ఫుట్‌బాల్ వ్యవహారాలు ఈ కమిటీనే చూసుకుంటుందని ఏఐఎఫ్‌ఎఫ్ ప్రకటించింది. దీంతో రాష్ట్ర ఫుట్‌బాల్ సంఘంలో నెలకొన్న సందిగ్ధత వీడిపోయింది. తన నియామకంపై వీహెచ్ సంతోషం వ్యక్తం చేశారు. ఫతేమైదాన్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన వీహెచ్ ఇకపై ఫుట్‌బాల్ అభివృద్ధిపై దృష్టిసారిస్తానన్నారు.