చంద్రబాబు నాయుడుపై ప్లీనరీలో మెగాస్టార్ చిరంజీవి ఫైర్

Chiranjeevi
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి నిప్పులు చెరిగారు. పార్టీ ప్లీనరీ సమావేశం ప్రారంభోపన్యాసంలో ఆయన తన వ్యక్తిగత విషయాల గురించి, రాజకీయాల గురించి మాట్లాడారు. ప్రజారాజ్యం పార్టీ వల్లనే తమకు అధికారం చేజారిందని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారని, దాంతో ప్రజారాజ్యం పార్టీని వారు టార్గెట్ చేసుకున్నారని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీని దెబ్బ కొట్టేందుకు తెలుగుదేశం పూనుకుందని ఆయన అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)పై కూడా ఆయన మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో తనపై కోడిగుడ్ల దాడి జరగడాన్ని గుర్తు చేస్తూ, తనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్న సమయంలో ఓ పార్టీ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారని, దానికి తనకు అశ్చర్యం వేసిందని, రాజకీయాలంటే ఇలా ఉంటాయని అప్పుడు తెలిసి వచ్చిందని ఆయన అన్నారు.

తనపై అపవాదులు సృష్టించారని, నిందలు వేశారని, అవమానించడానికి ప్రయత్నించారని, దెబ్బలు తగిలినవాడికి ఆ బాధేమిటో తెలుస్తుందని ఆయన అన్నారు. తాను సినీ రంగంలో మహారాజులా బతికానని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రజల రుణం తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అన్నారు. రాజకీయాలు ముళ్లబాట అని తెలుసునని, అందుకు తాను సిద్ధపడ్డానని ఆయన అన్నారు. రెండేళ్లలో తాను చాలా నేర్చుకున్నానని ఆయన అన్నారు. మనలాంటి రాజకీయాల్లో ఉండాలని, లేకుంటే స్వార్థ రాజకీయాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదని ఆయన అన్నారు.

బ్లడ్ బ్యాంక్ తో ఎందరికో ప్రాణదానం చేశానని, ఐ బ్యాంకుతో ఎందరికో చూపునిచ్చానని, ప్రజా సేవ విషయంలో తనలోని అసంతృప్తి తొలగిపోలేదని ఆయన అన్నారు. లోపల అంతర్మథనం జరుగుతోందని, ఆ స్థితిలో తనను విపరీతంగా అభిమానించి ఈ స్థాయికి తనను తెచ్చిన ప్రజల రుణం తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అన్నారు. కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారని, ప్రజల రుణం తీర్చుకుంటానని ఆయన చెప్పారు. తమ బలమేమిటో తెలుసు కాబట్టే కాంగ్రెసు పార్టీ తమకు రెడ్ కార్పెట్ పరుస్తోందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+