వైయస్ జగన్ కోసం కెవిపి రామచందర్ రావు రాయబారం

అయితే కాంగ్రెస్ అధిష్ఠానం జగన్ వైఖరిపై పూర్తిస్థాయిలో అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. ఓదార్పు యాత్ర మానుకోవాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం. ఎంతటి వారైనా పార్టీ గీసిన లక్ష్మణరేఖకు లోబడే ఉండాలని, ప్రజాదరణ ఉందన్న పేరుతో ఇష్టానుసారం వ్యవహరిస్తే సహించేది లేదని పేర్కొన్నట్లు తెలిసింది. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలని అన్నట్లు తెలుస్తోంది. పార్టీ లక్ష్మణ రేఖకు లోబడి జగన్ నడుచుకోకపోతే చర్యకు ప్రతి చర్య ఉంటుందని కుండబద్ధలు కొట్టినట్లు సమాచారం. జాతీయ పార్టీ ఇలాంటి బెదిరింపులకు భయపడదని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications