షూటింగ్ వల్లనే పవన్ కళ్యాణ్ ప్లీనరీకి డుమ్మా కొట్టాడా?

Pawan Kalyan
విశాఖపట్నం: విశాఖపట్నంలో జరుగుతున్న ప్రజారాజ్యం పార్టీ ప్లీనరీకి సినీ నటుడు, పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టాడు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చిరంజీవి చెబుతున్న కారణం నిజమేనా అనేది అనుమానంగానే ఉంది. సినిమా షూటింగ్ వల్ల పవన్ కళ్యాణ్ రాలేదని చిరంజీవి మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ చాలా కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ వ్యవహారాలు నచ్చక ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నట్లు భావిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకునే వ్యూహరచనలో, కార్యక్రమ ఖరారులో పార్టీ విఫలమైందనేది ఆయన భావనగా చెబుతున్నారు. దీంతో ఆయనకు ప్రజారాజ్యం పార్టీపైనే కాకుండా రాజకీయాలపై కూడా విసుగు పుట్టి సినిమాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారని చెబుతున్నారు. ఈ స్థితిలో చిరంజీవి చెబుతున్న కారణం నిజం కాదని భావిస్తున్నారు.

కాగా, కర్నూలు జిల్లాకు చెందిన శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డి కూడా ప్లీనరీకి రాలేదు. అలాగే, తెలంగాణకు చెందిన ఇద్దరు శాసనసభ్యులు మహేశ్వర రెడ్డి, అనిల్ కుమార్ కూడా డుమ్మా కొట్టారు. తెలంగాణ ప్రాంత నేతలు ప్లీనరీలో కనిపించనే లేదు. చిరంజీవి సమైక్య నినాదం వల్ల తెలంగాణ ప్రాంత నేతలు పార్టీకి దూరమయ్యారని చెబుతున్నారు. అంతేకాకుండా ప్లీనరీ బుధవారం ఉదయం వెలవెలబోయింది. ఆశించిన స్థాయిలో ప్రతినిధులు రాలేదు. దీంతో చిరంజీవి కినుక వహించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రజలకు దగ్గర కావాలన్నదే తమ అభిమతం తప్ప అధికార పార్టీకి దగ్గర కావాలనేది తమ అభిమతం కాదని చిరంజీవి అన్నారు. అధికారం కోసం తాను రాజకీయాల్లో రాలేదని ఆయన చెప్పారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+