వైయస్ జగన్ కు చెక్: పిసిసి అధ్యక్షుడిగా రెడ్డి

పిసిసి అధ్యక్ష పదవి కోసం మాజీ హోం మంత్రి కె. జానా రెడ్డి, శాసనసభ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, శాసనసభ్యుడు ఉత్తమ కుమార్ రెడ్డి, మరో శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి పేర్లను అధిష్టానం షార్ట్ లిస్టు చేసినట్లు తెలిసింది. జానా రెడ్డి మినహా మిగతా ముగ్గురు నాయకులు కూడా వివాద రహితులు. జానా రెడ్డి కూడా అంతగా వివాదాస్పదుడేమీ కారు. సురేష్ రెడ్డికి వ్యవహారదక్షుడిగా, మృదు స్వభావిగా పేరుంది. మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి ముఖ్యమంత్రి కె. రోశయ్యకు అత్యంత సన్నిహితుడు. ఉత్తమ కుమార్ రెడ్డిపై ఏ విధమైన ఆరోపణలు లేవు.
జగన్ విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని పిసిసి అధ్యక్షుడిగా నియమించాలనే ఉద్దేశంతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్లకు పార్టీలో అన్యాయం చేయడం లేదని, తమను ధిక్కరించడం వల్లనే జగన్ పట్ల కఠినంగా ఉంటున్నామని అధిష్టానం సంకేతాలు పంపాలని ఆలోచిస్తోంది. జగన్ వెంట వెళ్తున్నవారు కూడా ఎక్కువ మంది రెడ్లే కావడం కూడా అధిష్టానం ఆలోచనకు మరో కారణం. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులను, నాయకులను జగన్ వెంట వెళ్లకుండా ఆపడానికి కూడా వీలవుతుందని భావిస్తోంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications