జగన్ ను కౌంటర్ చేసేందుకు సోనియాతో విహెచ్ భేటీ

రాజశేఖర్ రెడ్డి చుట్టూ చేరిన వారికి ఇదివరకు పార్టీ, ప్రభుత్వ పదవులు కట్టబెట్టారని, ఇప్పుడుకూడా అదే ఉద్దేశంతో కొందరు అటువైపు మళ్లుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితులను పూర్తిగా మార్చాలంటే పార్టీ జెండాలు మోసిన కార్యకర్తలకు కార్పొరేషన్ పదవులు ఇవ్వాలని అధినేత్రిని కోరారు. రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు మూడేళ్లు కార్పొరేషన్ పదవుల భర్తీని బంద్ చేశారని, ఇప్పుడు రోశయ్య వచ్చి ఏడాది అయినా వాటి జోలికి పోలేదన్న విషయాన్ని సోనియా ముందుంచారు. ఇప్పుడైనా కార్పొరేషన్ పదవులు భర్తీచేసేలా రాష్ట్ర ముఖ్యమంత్రికి సూచించాలని కోరారు. రాజీవ్‌గాంధీ చేసిన త్యాగం, యువతను ముందుకు తీసుకురావడానికి ఆయన పడిన తపన గురించి నేటితరం కార్యకర్తలకు తెలియజెప్పేలా తాను ఏడాది పాటు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని తెలియజేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే రాజశేఖర్ రెడ్డే అనే వాతావరణం కల్పించేందుకు ఓ వర్గం తీవ్ర ప్రయత్నం చేస్తోందని, దీనికి కౌంటర్ కార్యక్రమం మొదలుపెట్టాల్సిన అవసరం ఉందని సోనియాకు విన్నవించారు.
కాగా, మంగళవారం సాయంత్రం సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్‌తో సుమారు 45 నిమిషాలు భేటీ అయిన పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ రాష్ట్రంలో పార్టీ పరిస్థితులన్నీ నియంత్రణలోనే ఉన్నాయన్న భావనను వ్యక్తంచేసినట్లు తెలిసింది. జగన్‌కూడా పార్టీ నియంత్రణలోకి వస్తారని, అన్ని వర్గాలను బ్యాలెన్స్ చేయడానికి తాను ప్రయత్నిస్తున్నానని చెప్పినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications