వైయస్ జగన్ వ్యవహారాలపై అధిష్టానిదే నిర్ణయం: డిఎస్

Srinivas
హైదరాబాద్: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యవహారాలపై మాట్లాడేందుకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ నిరాకరించారు. జగన్ వ్యవహారంపై పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జగన్ విషయాలను తమ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ చూసుకుంటారని, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ సలహాలు ఇస్తారని ఆయన అన్నారు. జగన్ వ్యవహారంపై ఎవరు మాట్లాడినా అదంతా వారి వ్యక్తిగతమేనని ఆయన అన్నారు.

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి ఉండే గౌరవం, ప్రతిష్ట ఎప్పటికీ ఉంటుందని ఆయన అన్నారు. వైయస్ ప్రథమ వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. గాంధీభవన్ లోనూ జిల్లాల్లోనూ పార్టీపరంగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించాలా, వద్దా అనే విషయంపై మీడియాతో తన అభిప్రాయాన్ని చెప్పబోనని, ముఖ్యమంత్రికి తన అభిప్రాయం చెప్తానని ఆయన అన్నారు. 2004 కౌంటింగ్ కు ముందు నోరు జారానని, వాత పడిందని ఆయన అన్నారు.

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. చిరంజీవి రాజకీయాల్లో పరిణతి చెందారని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తే ఆదుకుంటామని చెప్పడం చిరంజీవి రాజకీయ పరిపక్వతకు నిదర్శమని ఆయన అన్నారు. రాజకీయమంటే నెంబర్ గేమ్ అని, ఆ విషయాన్ని చిరంజీవి తెలుసుకున్నారని, అది చిరంజీవి రాజకీయ పరిణతికి నిదర్శనమని ఆయన అన్నారు. చిరంజీవిపై సినీ దంపతులు రాజశేఖర్, జీవిత వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరి కాదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+